News February 22, 2026

ఖమ్మం: సేంద్రియ సాగుకు సర్కారు దన్ను

image

రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో జిల్లాలో సేంద్రియ సాగును విస్తరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎంపిక చేసిన 3,750 ఎకరాలకు గాను, ఎకరానికి రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. రైతులకు గోఆధారిత ఎరువులు, జీవామృతం, పంచగవ్య తయారీపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.

Similar News

News February 27, 2026

పెండింగ్ కేసులపై వేగం పెంచాలి: తిరుపతి SP

image

తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ సుబ్బారాయుడు పెండింగ్ కేసులను గడువులోపు పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలలు, పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాలు, గాంజాపై జీరో టోలరెన్స్ విధానం అమలు చేయాలన్నారు. రౌడీషీటర్లపై నిఘా పెంచి అవసరమైతే పీడీ, PIT NDPS చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

News February 27, 2026

KPHBలో గజం భూమి రూ. 2.65 లక్షలు

image

KPHBలో హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో KPHBలో చదరపు గజం భూమి గరిష్ఠంగా రూ.2.65 లక్షలకు విక్రయమైంది. 1400 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాట్ ధర రూ.1.10 కోట్లకు చేరింది. మొత్తం 12 ఆస్తుల వేలం ద్వారా రూ.24.26 కోట్ల ఆదాయం లభించినట్లు వైస్‌ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఓపెన్ ప్లాట్స్ ద్వారా రూ.15.81 కోట్లు, ఫ్లాట్స్ రూ.8.45 కోట్లు వచ్చాయి.

News February 27, 2026

డోర్నకల్‌లో పోలీస్ ఇంట్లో చోరీ

image

MHBD జిల్లాలోని పోలీసు ఇంట్లో దొంగలు పడ్డారు. ఎస్సై ఉమా తెలిపిన వివరాలు.. డోర్నకల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి రూ.40,000 నగదు, వెండి వస్తువులను దొంగలించారు. ఘటనా స్థలాన్ని సీఐ చంద్రమౌళి క్లూస్ టీంతో పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.