News February 22, 2026

సంగారెడ్డి: కూతురికి ఫోన్ చేసి సూసైడ్!

image

కుటుంబ కలతలతో ఖేడ్ ఆర్టీసీ డిపో డ్రైవర్ పాపయ్య (45) మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మరణం తర్వాత పిల్లల పోషణ భారమై, మానసిక వేదన చెందేవాడు. శుక్రవారం కూతురికి ఫోన్ చేసి నాకు భయంగా ఉందని నేను చనిపోతున్నాను నీవు, తమ్ముడు బాగుండండి అంటూ నదిలో దూకాడు. హద్నూర్ పోలీసులు గాలింపు చేపట్టి శనివారం మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 24, 2026

విండీస్ గెలుపుతో టెన్షన్‌లో టీమ్‌ఇండియా

image

T20 WC సూపర్-8లో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల భారీ విజయం సాధించడంతో భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓడిన ఇండియా ఇప్పుడు తన తదుపరి మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. విండీస్ కొట్టిన భారీ స్కోరు, మెరుగైన నెట్ రన్ రేట్ వల్ల భారత్ ఒత్తిడిలో పడింది. ఇకపై జరిగే మ్యాచుల్లో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఇండియా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News February 24, 2026

కామారెడ్డిలో జాబ్ మేళా

image

కామారెడ్డిలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

News February 24, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.