News February 22, 2026

HYD సరిహద్దులు ఫిక్స్!

image

HYD మ్యాప్ అధికారికంగా మారిపోయింది. ORR దాటి RRR వరకు అథారిటీ పరిధి విస్తరించింది. 104 మండలాల్లోని 1,355 గ్రామాలు ఇప్పుడు ఈ పరిధిలోకి వచ్చాయి. RRRకి ఇరువైపులా 2 కి.మీ మేర ‘డెవలప్‌మెంట్ బఫర్’ జోన్ అమల్లోకి వచ్చింది. ఇకపై ఇక్కడ గ్రామ పంచాయతీ లేఅవుట్లకు అనుమతి ఉండదు. మొత్తం 10,472 చ.కి.మీ పరిధిలో కఠినమైన HMDA నిబంధనలు అమలు కాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చే చట్టబద్ధమైన మార్పు ఇది.

Similar News

News February 25, 2026

నిర్మల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 6,473

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా మాధ్యమిక విద్యశాఖ అధికారి పరుశురాం తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 6,473 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. వారికి 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షల నిర్వాహనకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు.

News February 25, 2026

రాష్ట్రంలోని పాల కేంద్రాల్లో తనిఖీలు: మంత్రి సత్యకుమార్

image

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఫుడ్ శాంపిల్స్ హైదరాబాద్ పంపిస్తున్నామని, త్వరలోనే విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక శ్రీకాకుళంలో డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. నీటి కలుషితం వల్లే డయేరియా ప్రబలిందని సత్యకుమార్ తెలిపారు.

News February 25, 2026

కాళ్ల: కలెక్టర్‌ను కలిసిన వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు

image

కలెక్టర్‌ నాగరాణిని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డా. మానస, డా. జాగృతి రోహిత్, డా. రాఘవేంద్ర, డా. సతీష్‌ చవాన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో వరి సాగుపై రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించారు. రైతుల సంక్షేమం కోసం వినూత్న ప్రయోగాలు చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.