News May 2, 2024
విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

విశాఖ ఆనందపురంలో చెక్ పోస్టు వద్ద భారీగా నకీలి కరెన్సీని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో చేపట్టిన దాడులలో 3 వాహనాలు, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 22 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 6 కత్తులు, రూ.10 లక్షల నకిలీ కరెన్సీ, ఒక రైస్ పూలింగ్ బౌల్, గోల్డ్ కోటెడ్ కాయిన్స్, బిస్కెట్‌లు పోలీసులు సీజ్ చేశారు.
Similar News
News March 26, 2026
విశాఖ: గ్రేటర్ విస్తరణలో 64 గ్రామాల భవిష్యత్తు ప్రశ్నార్థకం!

గ్రేటర్ విశాఖలో వార్డుల పునర్విభజనతో 120 డివిజన్లు ఏర్పాటవుతుండగా, విలీన ప్రతిపాదనల్లో ఉన్న 64 గ్రామాల భవిష్యత్తు చర్చనీయాంశమైంది. పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, భీమిలి మండలాల గ్రామాలను గ్రేటర్‌లో కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే గ్రామీణ పథకాలు కోల్పోయే అవకాశం, పన్నుల భారం పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి లాభాలు ఉన్నప్పటికీ ఈ మార్పులను స్వీకరిస్తారా అన్నది సందేహంగా మారింది.
News March 26, 2026
విశాఖ: ‘మాతృ మరణాలు జరగకుండా చూడాలి’

విశాఖ DMHO కార్యాలయంలో DMHO జగదీశ్వరరావు మాతృ మరణాలపై బుధవారం సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో భవాని గార్డెన్స్ పట్టణ ఆరోగ్యకేంద్రం, పీఎంపాలెం పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఒక్కొక్క మాతృ మరణం జరిగిందని మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూడాలన్నారు., హైరిస్క్ గర్భిణిలు ప్రసవానికి వచ్చినప్పుడు కేజీహెచ్‌కి గానీ VGHకి గానీ రిఫర్ చేయాలని ఆయన సూచించారు. మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 26, 2026
విశాఖ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

శ్రీరామనవమి సందర్భంగా విశాఖ నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు బుధవారం తెలిపారు. 26వ తేదీ సాయంత్రం విశాఖ నుంచి బయలుదేరి 27న ఉదయం భద్రాచలం చేరుకుంటాయి. శ్రీరామ నవమి రోజున భద్రాచలం దర్శనానంతరం అదేరోజు సాయంత్రం విశాఖకు తిరుగుపయనమవుతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి.


