News February 22, 2026
వికారాబాద్: బంపర్ ఆఫర్.. రూ.30 వేలకే స్కూటర్

ప్రభుత్వం మైనారిటీ యువతకు ఈ స్కూటర్ పథకం ప్రారంభించింది. స్కూటర్ ధర రూ.1.50 లక్షలు. అందులో రూ.1.20 లక్షలు సబ్సిడీగా ఇస్తుంది. లబ్ధిదారుడు రూ.30,000 మాత్రమే చెల్లించాలి. వయస్సు 21–40 సంవత్సరాలు ఉండాలి. 10వ తరగతి పాస్, డ్రైవింగ్ లైసెన్స్, PAN కార్డు తప్పనిసరి. దరఖాస్తులు 01-03-2026 వరకు tsobmms.cgg.gov.inలో అప్లై చేసుకోవాలని జిల్లా అధికారి ఎస్.రాజేశ్వరి తెలిపారు.
SHARE IT
Similar News
News February 25, 2026
కాళీమాత ఆలయ పునఃప్రతిష్ఠకు కేంద్ర మంత్రి సానుకూలత

మణుగూరు మండలంలోని చారిత్రాత్మక శ్రీ కాళీమాత ఆలయ తరలింపు, పునఃప్రతిష్ఠా పనులపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు భద్రాద్రి కలెక్టర్‌కు ఆయన అధికారిక లేఖ రాశారు. ఆలయాన్ని ప్రస్తుత ప్రాంతం నుంచి తరలించాల్సి ఉన్నందున, శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించేందుకు వీలుగా తక్షణమే ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆదేశించారు.
News February 25, 2026
FLASH: ఇంద్రవెళ్లిలో యాక్సిడెంట్

ఇంద్రవెళ్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడి గాయాల పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని అంజి రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి వ్యక్తి కింద పడిపోగా గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు అపస్మారక స్థితిలో ఉండడంతో ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది.
News February 25, 2026
జులైకి నల్లమల సాగర్ పూర్తి చేస్తాం: CBN

AP: 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ‘గోదావరి నుంచి 6 వేల టీఎంసీలు, కృష్ణా నుంచి 1500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి. కృష్ణా డెల్టా నుంచి నల్లమల సాగర్‌కు తీసుకొస్తాం. జులైకి నల్లమల సాగర్‌ను పూర్తి చేస్తాం’ అని మార్కాపురం సభలో ప్రకటించారు.


