News May 2, 2024
తెలంగాణలో అవినీతి రాకెట్ నడుస్తోంది: మోదీ

కర్ణాటక, తెలంగాణ.. కాంగ్రెస్‌కు ATMలుగా మారిపోయాయని PM మోదీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిందే ఈ 2 రాష్ట్రాల్లో త్వరలో జరగబోతోందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో అవినీతి రాకెట్ నడుస్తోంది. INC, BRS ఒకటే. ప్రస్తుతం కమీషన్ లేకుండా ఏ పనీ జరగట్లేదు. లిక్కర్ స్కామ్‌లో BRS పేరుంది. ఇక టెక్నాలజీ హబ్‌గా ఉన్న కర్ణాటక ఇప్పుడు ట్యాంకర్ హబ్‌గా మారిపోయింది’ అని విమర్శించారు.
Similar News
News March 18, 2026
డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం

LPG కొరత నేపథ్యంలో వినియోగదారులు PNGలోకి మారాలని కేంద్రం మరోసారి సూచించింది. LPG సమస్య ఉన్నా ఎక్కడా గ్యాస్ లభ్యత పూర్తిగా ఆగిపోలేదని తెలిపింది. LPG ఉత్పత్తి 40% పెరిగిందని పేర్కొంది. క్రూడ్, పెట్రోల్, డీజిల్ లభ్యత సాధారణంగానే ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రాలు/యూటీలకు అదనంగా 10% కమర్షియల్ LPGని కేటాయిస్తున్నామని.. ఇది భవిష్యత్తులో ఆ ప్రాంతాల్లో LPG నుంచి PNGకి మారేందుకు సహాయపడుతుందని తెలిపింది.
News March 18, 2026
OFFICIAL: SRH కెప్టెన్‌గా ఇషాన్

IPL-2026 ప్రారంభంలోని కొన్ని మ్యాచులకు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని SRH ప్రకటించింది. అలాగే అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉంటారని పేర్కొంది. పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులో చేరుతారని తెలిపింది. దీంతో ఈనెల 28న RCBతో జరిగే తొలి మ్యాచ్‌లో కిషన్ జట్టును నడిపించనున్నారు.
News March 18, 2026
ఈ టీమ్స్ టాపార్డర్ చూస్తే వణకాల్సిందే..

IPLలో ఈ సారి చాలా జట్ల టాపార్డర్ బలంగా ఉంది.
*SRH: అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్, క్లాసెన్
*MI: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్, విల్ జాక్స్
*CSK: మాత్రే, శాంసన్, గైక్వాడ్, శివమ్ దూబే
*KKR: అలెన్, సీఫర్ట్, గ్రీన్, రహానే
*LSG: మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్
*PBKS: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్
> వీటిలో ఏ టీమ్ విధ్వంసకరంగా ఉందో కామెంట్ చేయండి.


