News May 2, 2024

మెదక్‌కు బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కల్పిస్తా: రేవంత్

image

సిద్దిపేటలో మామపోతే అల్లుడు అన్నట్టుగా హరీశ్ రావు రాజ్యం ఏలుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మరోవైపు నిజాం వద్ద కాశీం మాదిరిగా కేసీఆర్ వద్ద వెంకట్రావ్ పని చేశారని విమర్శించారు. అందుకే మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. దొరల గడీలను బద్దలు కొట్టకపోతే బానిసల అవుతామని చెప్పారు. మెదక్‌ను బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కల్పిస్తానని  అన్నారు.

Similar News

News January 19, 2026

నేడు ‘ప్రజావాణి’ రద్దు: మెదక్ కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల సన్నాహక పనుల దృష్ట్యా సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులందరూ ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అన్ని మండల తాహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.

News January 17, 2026

మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

image

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో 32, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News January 17, 2026

మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.