News February 22, 2026

పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక

image

తమ వివాహాన్ని విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు ప్రకటించారు. ఈ మేరకు ఇరువురూ ఒకే తరహా పోస్టును ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘మేం ఏదైనా ప్లాన్ చేయడానికి ముందే మీరు చాలా ప్రేమతో మాకు ఓ పేరు పెట్టారు. మమ్నల్ని VIROSH అని పిలిచారు. మీ ఇష్ట ప్రకారమే మా వేడుకకు The Wedding of VIROSH అని పేరు పెట్టాలనుకుంటున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈనెల 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.

Similar News

News February 28, 2026

రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉందా? లోకేశ్ ఏమన్నారంటే..

image

AP: YCP హయాంలో తమ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన వారి పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ‘లా బ్రేక్ చేసిన, అందుకు ప్రేరేపించిన నేతలు, టార్చర్ చేసినవాళ్ల పేర్లు ఉంటాయి. జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. అటు SMలో 16ఏళ్ల లోపువారికి ఏజ్ అప్రాప్రియేట్ కంటెంటే కనిపించాలి. దీనిపై ఫ్రేమ్‌వర్క్‌కు కసరత్తు చేస్తున్నాం’ అని ముంబైలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో అన్నారు.

News February 28, 2026

WI చేతిలో 3 సార్లు హార్ట్ బ్రేక్.. ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే!

image

T20WC-2026లో భారత్ సెమీస్ చేరాలంటే మార్చి 1న కచ్చితంగా వెస్టిండీస్‌ను ఓడించి తీరాల్సిందే. అయితే పొట్టి ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు 4 సార్లు తలపడ్డాయి. మూడింట్లో విండీస్ గెలవగా, టీమ్ ఇండియా ఒకసారి మాత్రమే విజయం సాధించింది. 2009, 10లో సూపర్-8 దశలో, 2016లో సెమీఫైనల్లో ఓడించి భారత అభిమానుల హార్ట్ బ్రేక్ చేసింది. ఈసారి కూడా ఆ జట్టు బలంగా ఉంది. మరి WIను ఓడించాలంటే సూర్య సేన విజృంభించాల్సిందే.

News February 28, 2026

పాక్‌తో మేము చర్చలకు సిద్ధం: అఫ్గానిస్థాన్

image

పాక్‌తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నట్లు అఫ్గానిస్థాన్ ప్రకటించింది. కాగా ఇప్పటికే ఈ ఉద్రిక్తతలపై వెనక్కి తగ్గాలని చైనా, బ్రిటన్ సహా పలు దేశాలు సూచించాయి. అఫ్గాన్‌తో పోరులో 274 మంది తాలిబన్లను అంతం చేశామని మరో 400 మంది గాయపడినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అంతకుముందు తమ దాడుల్లో 50 మంది పాకిస్థాన్ జవాన్లు చనిపోయినట్లు తాలిబన్ సర్కార్ చెప్పుకొచ్చింది.