News May 2, 2024

YSR చనిపోతే బాధపడ్డాం.. కానీ జగన్ మాత్రం: చంద్రబాబు

image

AP: వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలేనని కడప ప్రజాగళం సభలో TDP చీఫ్ చంద్రబాబు విమర్శించారు. నేరాలు-ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్‌డీ చేశారని మండిపడ్డారు. YSR చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డామని, కానీ జగన్ మాత్రం అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని సంతకాల సేకరణ చేపట్టాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే కూటమి ఆలోచనని, అందుకు అందరం త్యాగాలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.

Similar News

News December 27, 2024

బలహీనపడిన అల్పపీడనం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాదాపు 10 రోజుల తర్వాత బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ APలోని ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వానలు పడే అవకాశం ఉందంది. కాగా ఇక వచ్చే వేసవి వరకు అల్పపీడనాలు, భారీ వర్షాలకు ఛాన్స్ లేదని పేర్కొంది.

News December 27, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధర

image

ఇటీవల కాస్త తగ్గిన పసిడి ధర మళ్లీ ఎగబాకుతోంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.280 పెరగగా, ఇవాళ మరో రూ.270 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రా. ధర రూ.78వేలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.71,500గా ఉంది. అటు కేజీ సిల్వర్ రేట్ లక్ష రూపాయలుగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News December 27, 2024

కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నిన్నటి‌తో గడువు ముగియగా నేడు కోర్టులో విచారణ జరగనుంది. కాగా రిమాండ్ విధించిన మరుసటి రోజే హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. రిమాండ్ పూర్తి ప్రాసెస్‌లో భాగంగా ఐకాన్ స్టార్ కోర్టుకు హాజరుకానున్నారు.