News February 23, 2026

నా ప్రియ మిత్రుడు మోదీ కోసం ఎదురుచూస్తున్నా: నెతన్యాహు

image

భారత్-ఇజ్రాయెల్ బంధం ఇద్దరు ప్రపంచ నాయకుల శక్తిమంతమైన కూటమి అని ఇజ్రాయెల్ PM నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ‘నా ప్రియ మిత్రుడు మోదీ ఈ నెల 25న వస్తున్నారు. జెరూసలేంలో ఆయన కోసం ఎదురుచూస్తున్నా. మేం ఇన్నోవేషన్, సెక్యూరిటీ, స్ట్రాటజిక్ విజన్‌లో భాగస్వాములం. స్థిరత్వం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. AI నుంచి ప్రాంతీయ సహకారం వరకు మా పార్ట్‌నర్‌షిప్ కొత్త శిఖరాలకు చేరుకుంటుంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News March 1, 2026

త్వరలోనే 10గ్రాముల బంగారం రూ.2లక్షలు?

image

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,70,000 <<19269997>>మార్కును<<>> దాటింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి, ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రమైతే అతి త్వరలోనే ఇది ₹2,00,000 మార్కును చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణం.

News March 1, 2026

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

image

ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీని అంతం చేసిన US అక్కడి ప్రభుత్వ మార్పుపై ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇరాక్‌లో సద్దాం అంతం అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా US అండతోనే పాలన సాగింది. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసినా అక్కడి ప్రభుత్వాన్నే కొనసాగించింది. అయితే ఇరాన్‌లో అలా సాధ్యం కాదని, భిన్నమైన వ్యూహంతో వెళ్లొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్గత కలహాలతో GOVT కూలిపోవచ్చంటున్నారు.

News March 1, 2026

పోకో, రెడ్‌మీ ఫోన్ల ధరలూ పెరిగాయి

image

ఇప్పటికే వివో, iQOO, శాంసంగ్ సంస్థలు <<19253401>>ఫోన్<<>> ధరలు పెంచేయగా.. ఈ లిస్ట్‌లో ఇప్పుడు మరో రెండు బ్రాండ్లు చేరాయి. పోకో తన C75, M7, C85, M7 ప్లస్, F7 మోడళ్లలోని వివిధ వేరియంట్లపై ₹1000-₹2500 వరకు ధరలు పెంచింది. ఇకపై పోకోలో బేస్ మోడల్ ఫోన్ ధర ₹10,999గా ఉండనుంది. ఈ హైక్ ఈరోజే అమలులోకి రానుంది. రెడ్‌మీ సైతం ఇదే స్థాయిలో పెంచినట్లు సమాచారం. మెమొరీ చిప్‌ల కొరతతో కంపెనీలు ధరలు పెంచాల్సి వస్తోంది.