News May 2, 2024

రేపు దోస్త్ నోటిఫికేషన్ విడుదల

image

TG: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే. ఇంటర్ పాసైన విద్యార్థులు దోస్త్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం మూడు విడతల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు.

Similar News

News December 27, 2024

Stock Markets: లాభాల్లో పరుగులు..

image

స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న మంచి స్టాక్స్‌ను కొంటున్నారు. సెన్సెక్స్ 78,896 (+424), నిఫ్టీ 23,858 (+108) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బ్యాంకు, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు జోరుమీదున్నాయి. BAJAJAUTO, TATAMOTORS, DRREDDY, EICHERMOT, INDUSIND టాప్ గెయినర్స్.

News December 27, 2024

మా హృదయాల్లో మన్మోహన్ స్థానం శాశ్వతం: రేవంత్

image

TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను స్మరించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘అగాధపు అంచుల నుంచి అద్భుత ప్రస్థానం వరకు.. భారత ఆర్థిక వ్యవస్థకు భాగ్య విధాత. మన్మోహన్ జీ.. మా హృదయాల్లో మీ స్థానం శాశ్వతం’ అని పేర్కొన్నారు. ఇవాళ సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.

News December 27, 2024

కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం?

image

TG: కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హుల ఆదాయపరిమితి ప్రస్తుతం గ్రామాల్లో ₹1.50L, పట్టణాల్లో ₹2L ఉండగా, దాన్ని మరో ₹20K పెంచుతారని తెలుస్తోంది. ప్రజా పాలనలో 10L దరఖాస్తులు రాగా JAN మొదటి వారం నుంచి మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. కార్డుల్లో మార్పులపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని సమాచారం. 30న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.