News May 2, 2024

సిద్దిపేట: కార్నర్ మీటింగ్.. రేవంత్ రెడ్డి స్పీచ్ హైలెట్స్

image

*కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15న రైతులను రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించారు.
*హరీష్ రావు రాజీనామా రాసిపెట్టుకో.. రుణమాఫీ చేసిన తర్వాత సిద్దిపేట చౌరస్తాలో లక్షమందితో సమావేశం నిర్వహిస్తాం.
*సిద్దిపేటలో దొరల రాజ్యం నడుస్తోంది.
*దుబ్బాక రావు.. సిద్దిపేట రావు పొద్దున రెండు పార్టీలు రాత్రి ఒక్కటే పార్టీ,
*మల్లన్నసాగర్‌లో భూములు గుంజుకొని అక్రమ కేసులు పెట్టివారికి ఎంపీ టికెట్

Similar News

News November 3, 2025

మెదక్: ప్రజావాణిలో 77 దరఖాస్తులు

image

మెదక్ కలెక్టరెట్‌లోని ప్రజావాణిలో మొత్తం 77 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 36, పింఛన్లకు సంబంధించి 07, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 07, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 27 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

మెదక్: చేవెళ్ల ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి

image

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. పేషెంట్ల కండీషన్‌ను డాక్టర్లు మంత్రికి వివరించారు. ఒక్కరికి మాత్రమే హెడ్ ఇంజురీ కాగా, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్య ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. బాధితులతో మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ధైర్యం చెప్పారు.

News November 3, 2025

మెదక్: రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

image

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.