News May 2, 2024
జగనన్న బాణం రివర్స్ అయింది: CBN
AP: జగన్ తన తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకుండా మోసం చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ‘జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయింది. అన్న, చెల్లి ఇంట్లో పోట్లాడుకోవాలి కానీ ఓట్లు చీల్చడం సరికాదు. దుర్మార్గుడికి ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే. జగన్ అరాచక పాలన వల్ల అమరరాజా, లులూ వంటి పరిశ్రమలు పారిపోయాయి’ అని చంద్రబాబు తెలిపారు.
Similar News
News December 27, 2024
US: 240 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా
అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్‌ను అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై ఆయన సంతకం చేశారు. 1782 నుంచి ఈ పక్షిని అమెరికా చిహ్నంగా వాడుతున్నా అధికారిక హోదా మాత్రం కల్పించలేదు. 240 ఏళ్ల తర్వాత బైడెన్ దీనికి ఇటీవల ఆమోద ముద్ర వేశారు. ఈ పక్షికి తెల్లటి తల, పసుపు రంగు ముక్కు, గోధుమ రంగులో శరీరం ఉంటుంది.
News December 27, 2024
బలహీనపడిన అల్పపీడనం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దాదాపు 10 రోజుల తర్వాత బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ APలోని ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వానలు పడే అవకాశం ఉందంది. కాగా ఇక వచ్చే వేసవి వరకు అల్పపీడనాలు, భారీ వర్షాలకు ఛాన్స్ లేదని పేర్కొంది.
News December 27, 2024
మళ్లీ పెరిగిన బంగారం ధర
ఇటీవల కాస్త తగ్గిన పసిడి ధర మళ్లీ ఎగబాకుతోంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.280 పెరగగా, ఇవాళ మరో రూ.270 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రా. ధర రూ.78వేలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.71,500గా ఉంది. అటు కేజీ సిల్వర్ రేట్ లక్ష రూపాయలుగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.