News February 23, 2026
జనగామ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

పాలకుర్తి మండలంలోని గుడికంటతండాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సర్పంచ్ మహేందర్ ఇంటి ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. ఇంటి ముందు కోడిగుడ్లు, మిరపకాయలు, నిమ్మకాయలతో భీతిగొల్పేలా ముగ్గులు వేయడంతో సర్పంచ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News February 27, 2026
45 కేసులు ఛేదన.. 76 మంది అరెస్టు: సీపీ

గడిచిన జనవరి నెలలో 69 ఆస్తి నేరాలు జరిగాయని 45 కేసులు గుర్తించి 76 మందిని అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ శంఖబత్రబాగ్చి తెలిపారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యల ప్రాపర్టీ మేళ నిర్వహించగా రూ.39.79 లక్షలు, 420 పోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 63 లక్షలు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు నగరంలో రూ. 13.94 కోట్లు విలువైన మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
News February 27, 2026
హ్యాపీగా ఉండాలంటే ఈ ఆహారం తినండి

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందట. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.
News February 27, 2026
మెదక్: పరీక్షలకు 97.25% విద్యార్థులు హాజరు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఇంగ్లిష్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మొదటి సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగంలో 5,877 గాను 5,716 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 608 గాను 589 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో మూడవ రోజు హాజరు శాతం 97.25% గా నమోదైంది. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని డీఐఈవో మాధవి తెలిపారు.


