News February 23, 2026

కృష్ణా: ‘డిగ్రీలతో ఉద్యోగాలు రావు’

image

అత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ముచ్చటించారు. కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావన్నారు. నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకొని వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 6, 2026

గుంటూరు: ఈ నెల 13 నుంచి HPV వ్యాక్సినేషన్

image

గుంటూరు జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్‌ను మార్చి 13 నుంచి ప్రారంభించనున్నట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. జిల్లాలో 14,167 మంది అర్హులను గుర్తించామని, PHCలు, CHCలు, GGHలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. 90 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో బాలికలందరికీ టీకా వేయించాలని ఆమె కోరారు.

News March 6, 2026

లిక్కర్ స్కామ్.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, చాణక్యకు చెందిన రూ.441 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసి పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారని పేర్కొంది. ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలిందని వెల్లడించింది. కమీషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేశారని వివరించింది.

News March 6, 2026

ICC టోర్నీల్లో 15వ సారి ఫైనల్‌కు.. గెలుస్తుందా?

image

టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. 1983లో కపిల్ దేవ్ ప్రారంభించిన విజయ పరంపరను గంగూలీ, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మల అడుగుజాడల్లో సూర్య బృందం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తోంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది 15వ సారి. WC, CT, WTCలలో మన జట్టు నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఎల్లుండి న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్ పోరులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.