News February 23, 2026
ఏలూరు: ఇంటర్ విద్యార్థులకు SP తీపికబురు

ఇంటర్ విద్యార్థులకు SP ప్రతాప్ శివ కిషోర్ తీపి కబురు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి ఆలస్యం అవుతుంటే ఏలూరులోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పోలీసు వాహనాలు పరీక్షా కేంద్రానికి తరలించడానికి సిద్ధంగా ఉంటాయన్నారు.
Similar News
News March 1, 2026
మార్చి 3న బాసర ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఉప ఆలయాలను కూడా మూసివేస్తామన్నారు. మంగళవారం తెల్లవారుజామునే అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు, నివేదనలు పూర్తి చేసి, ఉదయం 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు. తిరిగి అదే రోజు సాయంత్రం 7 గంటలకు మహా సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు.
News March 1, 2026
నిర్మల్ జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో విజేతలు వీరే

పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడల్లో పలు పాఠశాలల జట్లు విజేతలుగా నిలిచినట్లు నిర్మల్ DEO భోజన్న తెలిపారు. కబడ్డీ బాలుర విభాగంలో నిర్మల్ ఆశ్రమ పాఠశాల ప్రథమ, లక్ష్మణచందా ZPHS ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలో భైంసా ఆశ్రమ పాఠశాల విజేతగా, దిలావర్‌పూర్ ZPHS రన్నరప్‌గా నిలిచాయి. అలాగే ఖోఖో బాలుర విభాగంలో నిర్మల్ ఆశ్రమ పాఠశాల ప్రథమ, లక్ష్మణచందా ZPHS ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
News March 1, 2026
తూ.గో: ఇక ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తూ.గో రవాణాధికారి ఆర్. సురేశ్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ‘Sarathi Parivahan’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్ చెల్లింపుల వంటి సేవలను ‘Vahan Parivahan’ పోర్టల్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.


