News May 2, 2024
IPL: రాజస్థాన్‌కు షాక్.. SRH విజయం

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ గెలుపొందింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RR 200 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లలో కమిన్స్, భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్థాన్ బ్యాటర్లలో పరాగ్(77), జైస్వాల్(67) అర్ధసెంచరీలు చేశారు. SRH బౌలర్లలో భువనేశ్వర్ 3, నటరాజన్, కమిన్స్ తలో 2 వికెట్లు తీశారు.
Similar News
News March 22, 2026
మార్చి 22: చరిత్రలో ఈరోజు

1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం
2000: ఇన్సాట్-3బీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2009: సినీ నటుడు, నిర్మాత కాంతారావు మరణం (ఫొటోలో)
* ప్రపంచ జల దినోత్సవం
News March 22, 2026
బల్బ్‌లో కెమెరా.. డాక్టరే న్యూడ్ వీడియోలు తీసి

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక డాక్టర్ తన కొలీగ్‌పై ఉన్న వన్ సైడ్ లవ్‌తో నీచానికి ఒడిగట్టాడు. క్లినిక్ బల్బ్ హోల్డర్‌లో కెమెరా పెట్టి 3,000 ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని చూపించి ₹25 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు డాక్టర్ కమల్ నందాతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు.
News March 22, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


