News February 23, 2026
విజయవాడలో ప్రజాప్రతినిధుల మధ్య క్రీడా పోరు..!

ఇందిరాగాంధీ స్టేడియంలో MLA, MLCలకు ఈ నెల 24 నుంచి 3 రోజులపాటు పలు క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. పరుగు పందెం, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, షాట్‌పుట్, క్యారమ్స్, క్రికెట్, పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు మ్యూజికల్ ఛైర్ పోటీలు ఉంటాయన్నారు.
Similar News
News March 5, 2026
NGKL: జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు ఇవే..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అమ్రాబాద్‌లోని దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం. కృష్ణానదిని ఆనుకొని కొల్లాపూర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. లొద్ది మల్లయ్య ఆలయం మన్ననూర్ చెక్ పోస్ట్ తెలంగాణ అమర్నాథ్ గుహగా పిలువబడే ప్రదేశంలో ఆరు జలపాతాలు, గుహలో శివలింగం ఉంది. మల్లెల తీర్థం, పరహాబాద్ టైగర్ రిజర్వ్ చూడదగ్గ ప్రదేశాలు.
News March 5, 2026
మీరు చేసే పనులపై CM నిఘా.. కలెక్టర్ ఏం చెప్పారంటే?

CM చంద్రబాబు జిల్లాల పనితీరును నేరుగా పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారంపై క్రమం తప్పకుండా విశ్లేషణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఒక టీంగా పనిచేసి ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించాలని యంత్రాంగాన్ని కోరారు.
News March 5, 2026
తూ.గో: అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ద్వారా అగ్నివీర్ నియామకాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అవివాహిత పురుష అభ్యర్థులు ఈనెల 13 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తి గల జిల్లా అభ్యర్థులు Join Indian Army అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.


