News February 23, 2026
26న అమెరికా-ఇరాన్ న్యూక్లియర్ చర్చలు

అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ చర్చలకు రంగం సిద్ధమైంది. జెనీవా వేదికగా ఈ నెల 26న ఇరు దేశాల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఒమన్ మధ్యవర్తులు తెలిపారు. త్వరలోనే US రాయబారి స్టీవ్‌ను కలవనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మిడిల్ ఈస్ట్‌లో US సైన్యాన్ని మోహరిస్తున్నప్పటికీ తాము ఒత్తిడికి గురికాబోమని స్పష్టం చేశారు.
Similar News
News February 28, 2026
అమెరికాVsఇరాన్.. ఎవరి బలం ఎంత?

☛ డిఫెన్స్ బడ్జెట్: USA $895B, ఇరాన్ $15.4B
☛ యాక్టివ్ మిలిటరీ సిబ్బంది: USA 13.28L, ఇరాన్ 6.10L
☛ రిజర్వ్ మిలిటరీ: USA 7.99L, Iran 3.5L
☛ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైటర్స్: USA 1,790, Iran:188
☛ న్యూక్లియర్ వార్ హెడ్స్: USA: 5,244, Iran: 0
☛ అటాక్ హెలికాప్టర్లు: USA: 1,002, Iran: 13
☛ ట్యాంక్స్: USA: 4,640, Iran: 1,713
☛ సబ్‌మెరైన్స్: USA: 70, Iran: 25
News February 28, 2026
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. సంయమనం పాటించాలన్న భారత్

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. US, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించి, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తత వేళ DGCA కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేశాలకు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపేయాలని పేర్కొంది. కాగా Air India ఇప్పటికే తన సర్వీసులను రద్దు చేసింది.
News February 28, 2026
కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి: CM రేవంత్

TG: కోకాపేటలోని భూమిని శారదా పీఠానికే కొనసాగించాలని CM రేవంత్ నిర్ణయించారు. పీఠం భూములను జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఇవాళ హరీశ్ రావు సైతం అక్కడికి వెళ్లి మద్దతు తెలిపారు. అయితే కేటాయింపు భూముల్లో సాగుతున్న నిర్మాణ పనుల విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని అధికారులపై CM ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి భూముల కేటాయింపు రద్దు చేసి, శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు.


