News May 3, 2024
ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ

సార్వత్రిక ఎన్నికలకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎలాంటి ఘటనలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశించారు. బద్వేలు ఆర్డీవో కార్యాలయం మీటింగ్ హాలులో నియోజకవర్గ పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో కార్యాచరణ ప్రణాళికపై ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.
Similar News
News March 8, 2026
VN పల్లె: యువతకు స్ఫూర్తి శ్రీచరణి

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని శ్రీ చరణి నిరూపించారు. కడప జిల్లా VN పల్లె మండలంలో కుగ్రామమైన ఎర్రమల పల్లె గ్రామ కీర్తిని ఆమె జాతీయస్థాయికి తీసుకువెళ్లింది. పట్టుదలతో శ్రమించి తన అసాధారణమైన ప్రతిభతో భారత క్రికెట్ జట్టులో స్థానాన్ని సంపాదించి, మన దేశం ప్రపంచ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించి, పలువురి ప్రశంసలు అందుకుంది. ఆమె పట్టుదల నేటి మహిళలకు స్ఫూర్తి దాయకమని చెప్పవచ్చు.
#HAPPY WOMENS DAY
News March 8, 2026
కడప జిల్లాలో విద్యుత్ బకాయిలు రూ.26.46 కోట్లు

కడప జిల్లాలో ప్రవేట్ విద్యుత్ సర్వీసుల నుంచి ఇప్పటి వరకు రూ.26.46 కోట్లు బకాయిలు ఉన్నాయి. డివిజన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
కడపలో రూ.8.99 కోట్లు, ప్రొద్దుటూరులో రూ.10.61 కోట్లు, మైదుకూరులో రూ.7.10 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇక పులివెందుల డివిజన్ పరిధిలో మాత్రం కొన్ని ప్రవేట్ కంపెనీలు అడ్వాన్స్ చెల్లింపులు చేయడంతో ఇక్కడ రూ.24.85 లక్షలు మిగులు ఉన్నాయి.
News March 8, 2026
కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో జోరుగా చూచిరాత?

కడప జిల్లాలో 32 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులతో ఇన్విజిలేటర్లు చూచిరాత రాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు స్టడీ సెంటర్ల నిర్వాహకులు సంబంధిత అధికారులకు, ఇన్విజిలేటర్లకు, బందోబస్తు పోలీసులకు పెద్ద మొత్తంలో మామూళ్లు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకుంటామని DEO తెలిపారు.


