News February 23, 2026
ఎత్తయిన ప్రదేశాల్లో తక్కువగా డయాబెటిస్ ముప్పు.. కారణమిదే

సముద్రమట్టం కంటే అధిక ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్స్(US) సైంటిస్టులు కనుగొన్నారు. ‘ఆ ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలు మెటబాలిక్ మోడ్‌లోకి మారి పెద్దమొత్తంలో గ్లూకోజ్‌ను గ్రహిస్తాయి. తక్కువ ఆక్సిజన్‌తోనే శరీరం మనుగడ సాధిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులూ తగ్గుతాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News February 26, 2026
కన్నులపండువగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు సార్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
News February 26, 2026
జింబాబ్వేపై భారత్ విధ్వంసం.. స్కోర్ ఎంతంటే?

T20WC: చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. దీంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(55) హాఫ్ సెంచరీ చేశారు. ఇషాన్(38), సంజూ(24), సూర్య(33) రాణించారు. చివర్లో హార్దిక్(23 బంతుల్లో 50*), తిలక్(16 బంతుల్లో 44*) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే టార్గెట్ 257 రన్స్.
News February 26, 2026
ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే!

శరీర కండరాల బలం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగవ్వడానికి ప్రొటీన్ ఫుడ్ చాలా అవసరం. చికెన్ బ్రెస్ట్, చేపలు, గుడ్లు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, సోయా, బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, గుమ్మడికాయ గింజల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని డైలీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలిని తగ్గించి బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.


