News February 23, 2026
ఆర్ & బీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆర్ & బీ శాఖ పనితీరుపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, నాన్‌ప్లాన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ భావ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 1, 2026
కొయ్యూరు: యాక్సిడెంట్.. రెవెన్యూ ఉద్యోగికి గాయాలు

కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రపాలెం వీఆర్వో సత్యనారాయణ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ తన కుమారుడుతో కలిసి బైక్‌పై కేడీపేట వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన ఇద్దరిని అంబులెన్సు వాహనంలో కేడీపేట పీహెచ్‌సీకి తరలించారు.
News March 1, 2026
KMR: విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జిల్లా మానసిక వైద్యాధికారి

విద్యార్థులెవ్వరూ నిరాశ చెందవద్దని, పరీక్షా కాలంలో మానసిక ఒత్తిడిని జయించాలని జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మరోసారి రాసుకోవచ్చన్నారు. జీవితం కోల్పోతే మళ్లీ తిరిగి రాదన్నారు. ఇంటర్, పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఎటువంటి నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా పరీక్షలు బాగా రాయాలన్నారు. ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలకు దూరంగా ఉండాలన్నారు.
News March 1, 2026
అనకాపల్లి జిల్లా విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ (VSAAP) అనకాపల్లి జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జరిగాయి. అధ్యక్షుడిగా ఆర్.ఎస్.అప్పారావు, ఉపాధ్యక్షుడిగా ఐ.శ్రీను, కార్యదర్శిగా సి.హెచ్.ఉమామహేశ్, కోశాధికారిగా ఎస్.మోహన్, సంయుక్త కార్యదర్శులుగా పి.రవి ప్రసాద్, యు.జగన్నాథం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన బృందం సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


