News February 23, 2026

116 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>SBI <<>>116 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(AVP, డిప్యూటీ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc/BE/BTech, BCA/MCA, M.Tech, MSc, CA, ICAI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

Similar News

News March 2, 2026

ఇరాన్‌కు గల్ఫ్ దేశాల హెచ్చరిక

image

ఇరాన్ దాడులపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌లోని 6 దేశాలు (ఖతర్, సౌదీ, UAE, ఒమన్, బహ్రెయిన్, కువైట్) సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దాడులు తక్షణమే ఆపాలని, లేదంటే తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. దూకుడుగా ప్రతిస్పందించే ఆప్షన్ కూడా తమ వద్ద ఉందని హెచ్చరించాయి. ఇరాన్ దాడులు ప్రాంతీయ భద్రతకు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సమస్యగా మారాయని పేర్కొన్నాయి.

News March 2, 2026

AIIMS ఢిల్లీలో ఉద్యోగాలు

image

<>AIIMS<<>> ఢిల్లీ 16 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/BUMS/BAMS, పీజీ(ఎపిడిమాలజీ/పబ్లిక్ హెల్త్/కమ్యూనిటీ మెడిసిన్, సోషల్ సైన్సెస్), BSc(నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.aiims.edu

News March 2, 2026

రేపు సెలవు.. చంద్రగ్రహణంతో ఎల్లుండి హోలీ పండుగ!

image

హోలీ ఎప్పుడు జరుపుకోవాలని చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ల ప్రకారం రేపే (మార్చి 3) పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవు. అయితే రేపు చంద్రగ్రహణం ఉండటంతో మార్చి 4న (బుధవారం) హోలీ పండుగ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. రేపు రాత్రి (మంగళవారం) కామ దహనం జరుపుకోవాలని సూచిస్తున్నారు.