News February 23, 2026
విశాఖ: లారీ ఢీకొని మహిళ దుర్మరణం

విశాఖ పరిధి బీహెచ్‌పీవీ జంక్షన్లో రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం సబ్బవరం (M) ఆరిపాకకు చెందిన ఈశ్వరమ్మ(45) చెప్పులు కొనుగోలు చేసుకునేందుకు బీహెచ్‌పీవీ వద్ద ఓ దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో భారీ టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో ఆమె తల నుజ్జుయింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News February 27, 2026
చిత్తూరు జిల్లా వన్‌స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు

చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల మహిళలు నేటి నుంచి మార్చి 9 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ(లా, సోషల్ వర్క్, సోషల్ సైన్స్, సైకాలజీ), LLB, పారా మెడికల్ డిగ్రీ/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/
News February 27, 2026
జిల్లా ఆసుపత్రిలో పడిపోతున్న రక్త నిలువలు

జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో రక్త నిలువలు అడుగంటిపోతుండటం కలకలం రేపుతోంది. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్యాంకులో ప్రస్తుతం కేవలం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోగుల అవసరాల దృష్ట్యా ఒకరికి రక్తం ఇచ్చేందుకు ఇద్దరు దాతలను కోరుతున్నా.. కొరత తీరడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రోగులకు ప్రాణాపాయం తప్పదని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News February 27, 2026
MLA శ్రీధర్ స్థానంలోకి కొత్త వ్యక్తి.?

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పార్టీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే నివేదిక ఇవ్వలేదు, చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు వీడియోలు విడుదల చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారనే ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వారికి ఇన్‌ఛార్జ్ పదవి ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.


