News February 23, 2026
KMR: కేవీఆర్‌పై కక్ష సాధింపు చర్యలు: ఎంపీ డీకే అరుణ

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గెలిచిన కాటిపల్లి రమణారెడ్డిపై కక్ష గట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేను రానివ్వకుండా చేస్తూ అవమాన పరుస్తున్నారని మండి పడ్డారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ అనవసర రాద్ధాంతాలకు తెరలేపిందని కాంగ్రెస్ అని అన్నారు.
Similar News
News February 24, 2026
హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతి: వనపర్తి DIEO

హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని వనపర్తి జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి విద్యార్థులు మీసేవ, ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావచ్చని డీఐఈఓ సూచించారు.
News February 24, 2026
రేపే ఇంటర్ పరీక్షలు… సర్వం సిద్ధం

ఈనెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పర్యవేక్షణలో, పరీక్షల నిర్వహణ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 అమలులో ఉంటుందనీ, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 24, 2026
పరీక్షలా? ఈ శ్లోకాలు చదవండి!

గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్|
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనమ్|| (గణేష్ స్తోత్రం)
సరస్వతి స్తుతి:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా|
ఓం ప్రణో దేవీ సర్వస్వతీ వాజేభిర్వాజనీ వతీ
దీనా మవిత్రియవతు ఓం శ్రీ సరస్వత్యై నమః||


