News February 23, 2026

NGKL: ‘జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి’

image

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు షరతులు లేకుండా, పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని TWJF జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, వెంకటస్వామి, పరమేశ్ కోరారు.

Similar News

News March 3, 2026

తల్లిదండ్రులకు అలర్ట్.. ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘టెలీ మానస్’ సేవలను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్షల భయం, ఆందోళన లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటే ‘14416’ అనే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సలహాలు పొందవచ్చు. ఈ సేవలు 20కి పైగా భాషల్లో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలి. SHARE IT

News March 3, 2026

WGL: దట్టమైన అడవుల్లో జింకలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అరణ్య ప్రాంతాల మార్గంలో ప్రయాణం చేస్తుంటే జింకల గుంపులు ప్రత్యక్షమై చెంగుచెంగున ఎగురుతూ వెళ్లేవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా జింకలు కనిపించడం లేదు. పోడు సాగు, చెట్ల నరికివేత, గుట్టలు పిండి చేయడంతో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి అవి దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయి స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని వన్యప్రాణి ప్రేమికులు పరిశోధించి చెబుతున్నారు.
# నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం

News March 3, 2026

రేపు ఆన్‌లైన్ క్విజ్: డీఈవో నాగేశ్వరరావు

image

జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని డీఈఓ నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. 22 మండలాల నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రతిభ కనబరిచిన ఆరు టీములు ఈ నెల 6న జరిగే జిల్లా స్థాయి ఫైనల్స్‌కు ఎంపికవుతాయని ఆయన వెల్లడించారు.