News February 23, 2026
సిరిసిల్ల: డ్రంకెన్ డ్రైవ్.. 20 రోజుల్లో 364 కేసులు..!

సిరిసిల్ల కార్గిల్ లేక్ వద్ద సోమవారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొన్నారు. గత 20 రోజుల్లో సబ్ డివిజన్ పరిధిలో 364 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతిరోజూ తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News February 24, 2026
చీపురుపల్లిలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

సీఎం చంద్రబాబు ఈనెల 28న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలసకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 11.20 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదిక మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 1.40 నుంచి 2.25 వరకూ పైలపేటలోని లబ్ధిదారులను కలుస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావివలసలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుపయనమౌతారు.
News February 24, 2026
సిద్దిపేట: టెన్త్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 82 కేంద్రాల్లో మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిఘా ఉంచాలన్నారు.
News February 24, 2026
సంగారెడ్డి: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే చర్యలు!

ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 17,762 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,224 మంది కలిపి మొత్తం 35,986 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని సూచించారు.


