News February 23, 2026
ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి మార్చ్ 3, 5, 6 తేదీల్లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. టీజీటీ హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, సాంఘిక శాస్త్రం, గణితం, సైన్స్, కంప్యూటర్ బోధకుడు, సంగీతం/నృత్య బోధకుడు, కౌన్సిలర్, ప్రత్యేక ఉపాధ్యాయుడు, PRT, Sports బోధకుడు, తెలుగు భాషా ఉపాధ్యాయుడు స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయన్నారు.
Similar News
News February 27, 2026
ప.గో జిల్లా కలెక్టర్ ఆగ్రహం

ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను ముగించాలని స్పష్టం చేశారు.
News February 27, 2026
133 మంది తాలిబన్ ఫైటర్లను చంపేశాం: పాక్

తమతో <<19250927>>యుద్ధానికి<<>> దిగిన 133 మంది అఫ్గాన్ ఫైటర్లను చంపేసినట్లు PAK సమాచారశాఖ మంత్రి అతవుల్లా తరార్ తెలిపారు. 200 మందికి పైగా గాయాలైనట్లు వివరించారు. దీన్ని AFG ప్రభుత్వం ఖండించింది. తమ ఫైటర్లు 8 మందే చనిపోయారని, 11 మంది గాయపడినట్లు వెల్లడించింది. తాము 55 మంది PAK సైనికులను చంపేశామని, 2 మిలిటరీ బేస్‌లను, 19 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామంది. అయితే తమ సైనికులు ఇద్దరే చనిపోయినట్లు పాక్ చెబుతోంది.
News February 27, 2026
మార్చిలో తిరుమలలో విశేష పర్వదినాలు

☞ మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి ☞ 3న కుమారధార తీర్థ ముక్కోటి, చంద్ర గ్రహణం కారణంగా ఉ. 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత ☞ 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ☞ 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ☞28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ☞30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం.


