News February 23, 2026

పల్నాడు: ఉద్యోగం పేరిట రూ.లక్షల్లో మోసం..!

image

గుండ్లపల్లికి చెందిన యువకుడు మోసపోయిన ఘటన సోమవారం వెలుగులోకొచ్చింది. బాధిత యువకుడు నరేష్‌కు జాబ్ ఇప్పిస్తానని చెన్నైకు చెందిన నిందితుడు అరుణ్ నమ్మబలికించాడు. దీంతో అతను అరుణ్ ఖాతాకు ఆన్లైన్ ద్వారా రూ.6.30లక్షలు చెల్లించాడు. ఉద్యోగం కల్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ‘మా బాబాయి మంత్రి’ అంటూ సాకులు చెప్పి ఫోన్ బ్లాక్ చేశాడన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు SPకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

Similar News

News February 27, 2026

అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

image

ఆటోఇమ్యూన్‌ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఇమ్యూన్‌ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్‌) అంతే బలంగా ఉంటాయి.

News February 27, 2026

HNK: అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?

image

అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా HNK కలెక్టరేట్ మారింది. ఏకంగా ACBకి అడిషనల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఇంట్లో నోట్ల కట్టలు కూడా దొరికాయి. ప్రస్తుతం IASల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అక్రమార్కులపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి పనికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తన మార్క్ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు.

News February 27, 2026

ఖమ్మం: విద్యార్థుల్లో పెరుగుతున్న దృష్టి లోపాలు

image

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లాలో నిర్వహించిన కంటి పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సెల్‌ఫోన్ల వాడకం, పోషకాహార లోపంతో 42,277 మంది విద్యార్థులను పరీక్షించగా, 2,297మందిలో దృష్టి లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గుండె జబ్బులు, ఇతర శారీరక లోపాలున్న విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.