News May 3, 2024
తమిళ సినిమాలను తెలుగులో కాపీ కొట్టారు: సుందర్

తమిళ దర్శకుడు, ఖుష్బూ భర్త సుందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను గతంలో చూసిన తెలుగు సినిమాలు కొన్ని తమిళ్ నుంచి కాపీ కొట్టారని అన్నారు. తాను తీసిన మూవీ కంటెంట్‌ను కూడా కాపీ చేశారని ఆరోపించారు. ఆ పగతోనే గత ఏడాది తెలుగు సినిమాలను కాపీ కొట్టి ‘విన్నర్’ మూవీ తీశానని చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘బాక్’ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
Similar News
News November 4, 2025
‘ది రాజాసాబ్’ విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మూవీ టీమ్ ఖండించింది. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News November 4, 2025
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 519 పాయింట్ల నష్టంతో 83459 వద్ద ముగియగా, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 25597 వద్ద సెటిలైంది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్. టైటాన్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎం&ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లాభపడ్డాయి. కన్‌జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం మినహా తక్కిన సెక్టార్ల స్టాక్స్ అన్నీ ఎరుపెక్కాయి.
News November 4, 2025
హిందూజా గ్రూప్ ఛైర్మన్ మృతి

హిందూజా గ్రూప్ ఛైర్మన్, ఇండియన్-బ్రిటిష్ బిలియనీర్ గోపీచంద్ హిందూజా (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ రామీ రేంజర్ వెల్లడించారు. గోపీచంద్ మరణంతో ఒక శకం ముగిసిందని, ఆయన సమాజ శ్రేయోభిలాషి, మార్గదర్శక శక్తి అని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన లండన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.


