News May 3, 2024
రేవంత్ తప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు: KTR

TG: ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ తప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేశారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. ఈ విషయంలో తాను చెప్పిన దాంట్లో తప్పుందని తేలితే చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు. ఒకవేళ రేవంత్‌ది తప్పైతే ఆయనను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ తప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేశారని ట్వీట్ చేసినందుకు తమ నేత క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారని KTR అన్నారు.
Similar News
News March 17, 2026
SGSW ఉద్యోగులు.. ఆలస్యమైతే లీవ్ కట్

AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (SGSW) ఉద్యోగుల హాజరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. 10.30amలోగా హాజరు నమోదు చేయాలని, 10min గ్రేస్ టైమ్ ఉంటుందని స్పష్టం చేసింది. 10.40am తర్వాత హాజరు నమోదైతే హాఫ్ డే సెలవుగా, 2.01pm-5pm మధ్య హాజరు నమోదైతే పూర్తి రోజు సెలవుగా పరిగణించనుంది. ఉద్యోగుల అటెండెన్స్ యాప్‌లో ఈ నిబంధనలు కనిపిస్తున్నాయి. DDO అనుమతితో నెలకు 3 రోజులు దీని నుంచి మినహాయింపు పొందొచ్చు.
News March 17, 2026
జగ్గారెడ్డి PCC చీఫ్ అయితే 100 సీట్లు గ్యారంటీ: కోమటిరెడ్డి

TG: PCC చీఫ్‌గా జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్‌గా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘జగ్గారెడ్డి మరొక PJR. ఆయన లాగే ప్రజా నాయకుడు. జగ్గారెడ్డి PCC చీఫ్‌గా ఉంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లలో గెలుస్తుంది. మహేశ్ గౌడ్‌ను తొలగించి జగ్గారెడ్డిని PCC చీఫ్‌గా చేయాలి’ అని సూచించారు.
News March 17, 2026
డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.


