News February 23, 2026
TGPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

TG: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునే గడువును మార్చి 25కు పొడిగిస్తున్నట్లు TGPSC ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ <
Similar News
News February 28, 2026
3,979 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే ఛాన్స్

యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే(మార్చి 3) సమయం ఉంది. ITI, టెన్త్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200+GST, SC, ST, మహిళలకు రూ.100+GST. వెబ్‌సైట్: recruit-gov.com/
News February 28, 2026
కొత్త CSగా సాయిప్రసాద్ బాధ్యతలు

AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తాజా మాజీ సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సాయి ప్రసాద్ 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తొలుత ఉమ్మడి APలో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆపై పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన CSగా ఎంపికయ్యారు.
News February 28, 2026
AI ఫియర్.. ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు!

ఏఐ విప్లవం ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నా కొన్ని వృత్తులు మాత్రం అత్యంత సురక్షితమని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ వంటి శారీరక నైపుణ్యం ఉన్నవారిని ఏఐ భర్తీ చేయలేదు. అలాగే డాక్టర్లు, నర్సులు, టీచర్లు, చెఫ్, వ్యవసాయం వంటి వృత్తులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చేతులతో చేసే పని, మనుషులతో జరిపే సంభాషణ ఉన్నంత కాలం ఈ ఉద్యోగాలకు ఢోకా ఉండదని సూచిస్తున్నారు.


