News February 24, 2026

ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొని ఇద్దరు యువకుల మృతి

image

సిద్దిపేట-కరీంనగర్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రోబో రెస్టారెంట్ సమీపంలో బైక్ నియంత్రణ తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొమ్మల పృథ్వి అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ గుజారి నవీన్ మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 27, 2026

ప్రొద్దుటూరులో బంతి బంతికి పందెం.?

image

T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు క్రికెట్ ప్రియులకు సందడిగా మారాయి. ఈ సీజన్లో ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు బంతి బంతికి పందెం నిర్వహిస్తున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్ జూదానికి బానిస అయ్యారు. ప్రత్యేక బెట్టింగ్ యాప్‌లతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ప్రొద్దుటూరు క్రికెట్ మాఫియాతో రాజకీయ నాయకులకు, పోలీసులకు లింక్ ఉందనే ఆరోపణలున్నాయి.

News February 27, 2026

ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్

image

AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత CJ జస్టిస్ ధీరజ్‌సింగ్ మరో 2 నెలల్లో రిటైర్ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా పంజాబ్&హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. B.A. LL.B, LL.M పూర్తి చేసిన ఈమె 1990లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో పంజాబ్&హరియాణా జడ్జిగా నియమితులయ్యారు.

News February 27, 2026

ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు అమ్మాయిలకే ఎక్కువ

image

మన ఇమ్యూన్‌ సిస్టమ్‌ ఎప్పుడూ వైరస్‌లూ, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక కణాలు ఒంట్లోని సొంత కణాలతోనే పోరాడతాయి. వాటినే ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ అంటారు. ఇవి మహిళల్లో 20-40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి.