News February 24, 2026

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ!

image

తెలంగాణ మావోయిస్ట్ క్యాడర్ DGP శివధర్ రెడ్డి సమక్షంలో రేపు లొంగిపోనున్నట్లు సమాచారం. కీలక నేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి, చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి అస్త్ర సన్యాసం చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో 15 మంది లొంగిపోనున్నారట. దీంతో TG మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు. రేపు దీనిపై DGP అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు.

Similar News

News March 11, 2026

నల్గొండ: మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల ఊసేదీ?

image

జిల్లాలో కొత్త మున్సిపల్ కౌన్సిళ్లు ఏర్పడి రోజులు గడుస్తున్నా, ఇంతవరకు సమావేశాల ఊసే లేకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదానికి కేవలం 20 రోజుల గడువు మాత్రమే ఉండటంతో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమోదం పొందుతామని స్పష్టం చేశారు.

News March 11, 2026

20 నెలల్లో రూ.3.20 లక్షల కోట్ల అప్పులు: జగన్

image

AP: సీఎం చంద్రబాబు 20 నెలల్లో రూ.3.20 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. తాము కరోనా పరిస్థితుల్లోనూ తక్కువగానే అప్పులు చేశామని, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని విమర్శించారు. రాష్ట్ర ఖజానాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేదని, చంద్రబాబు బిల్డప్ మాత్రమే ఇస్తున్నారని ఫైరయ్యారు. అసెంబ్లీలోనూ అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పారని, ఆ సమావేశాల వల్ల ఒరిగిందేమీ లేదని ప్రెస్ మీట్‌లో మండిపడ్డారు.

News March 11, 2026

ప్లాస్టిక్‌తో హార్మోన్ల అసమతుల్యత

image

ప్రస్తుతకాలంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆహారపదార్థాలను ప్యాక్ చేయడానికి ఎక్కువగా వీటినే వాడుతున్నారు. అయితే వీటిల్లో బిస్పినాల్‌ ఏ (BPA) రసాయనం ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్‌, టెస్టోస్టిరాన్‌ సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. మగవాళ్లలో శుక్ర కణాల సంఖ్య తగ్గడం. ఆడవాళ్లలో PCOS, టైప్‌2 డయాబెటిస్‌, నాడీ వ్యవస్థ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.