News May 3, 2024
ఖైరతాబాద్: ఈనెల 4న కాంగ్రెస్ ‘ఛలో నెక్లెస్‌రోడ్ “
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ సచివాలయం సమీపంలోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఈనెల 4న ‘ఛలో నెక్లెస్‌రోడ్ ” పేరిట ఓ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 4న నిర్వహించే కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ పార్టీ నేతలను కోరారు.
Similar News
News January 3, 2025
HYDలో పెళ్లి ఖర్చుకు వెనకాడట్లే..!
హైదరాబాద్‌లో రోజురోజుకు పెళ్లిళ్ల ఖర్చు అమాంతం పెరుగుతోంది. ఓ సర్వే ప్రకారం వివాహ ఖర్చు నగరంలో రూ.30 లక్షల నుంచి రూ.కోటికి పైగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాదికి దాదాపు 30% పెరుగుతోందని కాన్ఫరెన్స్ ట్రేడర్స్ సర్వే తెలిపింది. పెళ్లి ఖర్చుకు సంపన్నులు సహా, మధ్యతరగతి వారు సైతం వెనకాడటం లేదని పేర్కొంది.
News January 3, 2025
HYD: నిర్ణయం మార్చుకోకుంటే ఉద్యమమే: ఎంపీ లక్ష్మణ్
HYD రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ అలైన్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మార్చాలని BJP నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం టెండర్లు పిలవడం శుభపరిణామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం RRR నార్త్ అలైన్‌మెంట్ మార్పు చేయాలని, లేదంటే బాధితుల పక్షాన ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
News January 3, 2025
HYD: సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్
నేడు సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉండనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జల మండలి బోర్డు మీటింగ్‌కి హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సెక్రెటేరియట్‌లో రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం సమీక్ష ఉండనుంది.