News May 3, 2024
ASF: వడదెబ్బతో ఒకరి మృతి

బెజ్జూరు మండలంలోని గబ్బాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్(40) అనే వ్యక్తి గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 2రోజుల క్రితం దహేగాం మండలంలోని పోలంపల్లిలో జరిగిన శుభకార్యానికి వెళ్ళాడు. ఈ క్రమంలో వాంతులు, విరోచనాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య జానభాయ్ , ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
Similar News
News March 30, 2026
ADB: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ ఆదేశం

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 28 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితుల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశించారు. ప్రధానంగా కుటుంబ, భూ వివాదాలు నమోదయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్‌కు తెలపాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు.

ప్రజావానికి 101 ఫిర్యాదులు: ఆదిలాబాద్ కలెక్టర్

ప్రజావాణి ద్వారా అందే ప్రతి ఫిర్యాదును 30 రోజుల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికలను సమయానికి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి సమస్యలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 101 ఫిర్యాదులు అందయన్నారు.