News May 3, 2024

పోస్టులు పెడుతున్నారా.. జాగ్రత్త సుమా!

image

ఖమ్మం జిల్లా సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్కు , రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.

Similar News

News October 2, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక ప్రజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News October 2, 2024

ఖమ్మం: నేడు గాంధీ జయంతి.. ఈ దుకాణాలు బంద్

image

నేడు గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చికెన్, మటన్, ఫిష్, వైన్ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు బెల్టు షాపులు, మరోవైపు మాంసం దుకాణాలు దొంగచాటుగా మద్యం, మాంసాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయి.

News October 2, 2024

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు శుభవార్త: మంత్రి పొంగులేటి

image

దసరా పండుగ సమీపిస్తోన్న వేళ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్ర సచివాలయం వేదికగా మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పండుగలోపే అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు అందిస్తామని అన్నారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.