News May 3, 2024

ప్రచారానికి మిగిలింది.. ఇంకా 9 రోజులే

image

ఖమ్మం లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా 9 రోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు . ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరికి వారు ధీమాగా ప్రచారాన్ని ఉధృతం చేశారు.

Similar News

News November 27, 2024

భద్రాచలాన్ని మండలంగా ప్రకటిస్తూ జీవో జారీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరొక మండలాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. భద్రాచలం పట్టణాన్ని మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ను వెలువరించింది. భద్రాచలాన్ని మండలంగా ప్రకటిచడంతో మళ్లీ ఎన్నికల సందడి నెలకొననుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎంపీపీ జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నాయి.

News November 27, 2024

CM రేవంత్ తో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. నిర్దిష్ట సమయంలో ధాన్యం సేకరణ పూర్తి కావాలని, సేకరించిన వాటికి చెల్లింపులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అటు జిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణ వివరాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

News November 27, 2024

రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్యే కూనంనేని

image

అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దీంతోపాటు అదానీ చేసుకున్న ఒప్పందాలలో ఏమైనా అవినీతి జరిగిందా అనే కోణాన్ని కూడా ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.