News May 3, 2024
మారుమూల ప్రాంత చిన్నారులకు టెన్నిస్ శిక్షణ

భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. అస్సాంలోని మజూలి ద్వీపం, బొంగాయ్‌గాన్‌లోని మారుమూల ప్రాంతాలకు చెందిన 25 మంది చిన్నారులకు టెన్నిస్ క్రీడలో శిక్షణ ఇవ్వనున్నారు. కమల్ ఇండియా ఫౌండేషన్(UK)తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. బెంగళూరులోని ఆర్బీటీ అకాడమీలో వీరికి శిక్షణ ఇస్తారు. చిన్నారులకు వసతితో పాటు విద్య అవసరాలను దాత సహకారంతో బోపన్న పర్యవేక్షిస్తారు.
Similar News
News March 20, 2026
ఇరాన్ యుద్ధం.. కేంద్రాన్ని సమర్థించిన థరూర్

ఇరాన్ విషయంలో కేంద్రం ‘సైలెన్స్’ను కాంగ్రెస్ MP శశి థరూర్ సమర్థించారు. ఈ విషయంలో ఆయన మరోసారి పార్టీ లైన్‌ను దాటారు. కొన్నాళ్లుగా కేంద్రం వైఖరిని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. స్వయంగా అగ్రనేత <<19286514>>సోనియా గాంధీ<<>> ఈ విషయంపై వ్యాసం రాశారు. థరూర్ మాత్రం వాటన్నింటితో విభేదిస్తూ.. కేంద్రం ‘సరెండర్’ కాలేదని ‘సంయమనం’ పాటిస్తోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే సరైన విధానమని పేర్కొన్నారు.
News March 20, 2026
పెరిగిన ‘పవర్’ పెట్రోల్ ధర

దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధర పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOCL లీటర్‌పై రూ.2.09-రూ.2.35 వరకు వడ్డించాయి. ఈరోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నార్మల్ పెట్రోల్ రేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా తగ్గడంతో రేట్లు సవరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
News March 20, 2026
గుడ్ న్యూస్: డెయిరీ, గొర్రెల ఫారాలకు ఛార్జీల రద్దు

AP: రాష్ట్రంలోని డెయిరీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారుల నుంచి వసూలు చేస్తున్న బెటర్‌మెంటు, డెవలప్మెంటు ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీటికి సంబంధించి మున్సిపాల్టీల పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్, లైసెన్స్ ఫీజులను పంచాయతీలతో సమానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మినహాయింపులపై GO ఇచ్చారు.


