News February 24, 2026

భూ కేటాయింపుల జోరు.. విద్యా, మౌలిక వసతులకు పెద్దపీట!

image

TG: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల కోసం భూములను కేటాయిస్తూ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోహెడలో లాజిస్టిక్స్ పార్క్ కోసం 223 ఎకరాలు, మహబూబాబాద్, హుస్నాబాద్‌లలో ఇంజనీరింగ్ కాలేజీలకు స్థలాలను కేటాయించింది. అలాగే 10 జిల్లాల్లో 21 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. HYD ఎలివేటెడ్ కారిడార్ కోసం కాప్రాలో 153 ఎకరాలు, ఖమ్మంలో TTD ఆలయానికి 20 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

Similar News

News February 27, 2026

LSG కొత్త జెర్సీ రిలీజ్

image

IPL-2026: LSG జట్టు కొత్త జెర్సీని రిలీజ్ చేసింది. ఓనర్ సంజీవ్ గోయెంకా తన జట్టు కొత్త డ్రస్సును రివీల్ చేశారు. కొత్త జెర్సీతో ఉన్న స్క్వాడ్ ఫొటోను LSG SM పేజీల్లో షేర్ చేసింది. అయితే ఇది ఫుట్‌బాల్ టీమ్ డ్రస్సును పోలి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక గతేడాది లీగ్‌లో 14 మ్యాచులు ఆడిన LSG 8 మ్యాచుల్లో ఓడిపోయి పెద్దగా ప్రభావం చూపలేదు. కొత్త జెర్సీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

News February 27, 2026

SBI క్లర్క్ పోస్టులు.. మెయిన్ ఫలితాలు విడుదల

image

SBI క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. 2025 నవంబర్ 21న ఈ పరీక్ష జరిగింది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT)కు హాజరు కావాల్సి ఉంటుంది. కాగా దాదాపు 6వేలకు పైగా క్లర్క్ పోస్టులకు గతేడాది AUGలో నోటిఫికేషన్ వచ్చింది. రిజల్ట్స్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 27, 2026

3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV టీకా: సత్యకుమార్

image

AP: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లు కలిగిన 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ ఇవ్వనున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. VZM జిల్లా చీపురుపల్లిలో శనివారం CM చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారన్నారు. ‘తొలివిడతగా కేంద్రం నుంచి 1,90,800 డోసులు వచ్చాయి. మిగతా వ్యాక్సిన్ ఇంకా అందుతుంది. కోల్డ్ స్టోరేజీ ఉన్న 1,645 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు’ అని చెప్పారు.