News February 24, 2026
DMK కూటమిలో సీట్ల సెగ.. 45 స్థానాలకు కాంగ్రెస్ పట్టు?

తమిళనాడు ఎన్నికల వేళ అధికార DMK నేతృత్వంలోని కూటమిలో సీట్ల గొడవ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 45 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో DMK ఓడిపోయిన స్థానాల్లో కనీసం 20 చోట్ల తమకు బలం ఉందని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. CM స్టాలిన్ మాత్రం కాంగ్రెస్‌కు 25 సీట్లకు మించి ఇచ్చేందుకు ఇష్టపడటం లేదట. మరోవైపు IUML, MMK చెరో 5 సీట్లు డిమాండ్ చేస్తున్నాయని టాక్.
Similar News
News March 2, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 2)

* 1933: బాలీవుడ్ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఆనంద్‌జీ వీర్జీ షా జననం
* 1936: రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
* 1962: తెలంగాణ కవి యాకూబ్ జననం
* 1938: నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
* 1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల సరోజిని నాయుడు మరణం (ఫొటోలో)
* 1990: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా మంత్రి మసూమా బేగం మరణం
News March 2, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 2, 2026
యూఏఈపై ఇరాన్ దాడులు.. ఖండించిన ప్రధాని మోదీ

అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్ యూఏఈపై విరుచుకుపడటాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన మోదీ.. యూఏఈకి భారత్ అండగా ఉంటుందని తెలిపారు. అక్కడి పరిస్థితిపై యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్‌తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో అక్కడి భారతీయులు క్షేమంగా ఉండేందుకు UAE చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు.


