News February 24, 2026
అనకాపల్లి: గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన కె.నానాజీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాకినాడ జిల్లా తునిలో సైకిల్ షాప్ నిర్వహిస్తున్న నానాజీకి పక్కనే ఉన్న బైక్ మెకానిక్ రాజుకు ఈనెల 18న గొడవ జరిగింది. దీంతో రాజు, నానాజీపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తుని సీఐ గీతా రామకృష్ణ తెలిపారు.
Similar News
News March 7, 2026
అల్లు అర్జున్‌తో శిల్పా రవి

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News March 7, 2026
సివిల్స్‌లో సత్తా చాటిన ఇల్లందు బిడ్డ

‘కష్టేఫలి’ అనే మాటకు నిదర్శనంగా నిలిచింది ఇల్లందుకి చెందిన బానోతు లక్ష్మీ రచన. ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆమె 178వ ర్యాంకు సాధించి మెరిశారు. బానోత్ వెంకటరమణ, తులసమ్మల కుమార్తె అయిన లక్ష్మి మూడుసార్లు విఫలమైనా పట్టు వదలకుండా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి త్రుటిలో అవకాశం కోల్పోయినా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించారు.
News March 7, 2026
కరీంనగర్: తమ్ముడే హంతకుడా..?

కరీంనగర్(D) రామడుగు(M)లో ఇటీవల జరిగిన గౌరమ్మను <<19305393>>గొంతు కోసి హత్య <<>>చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం విషయంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని తన తల్లిని తమ్ముడు అనిల్ కుమార్ హత్య చేసి ఉండవచ్చని పెద్ద కొడుకు మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


