News February 24, 2026

సొంతిళ్లు లేని వారికి శుభవార్త

image

AP: పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసం రాష్ట్రంలో 10.42 లక్షల మంది అప్లై చేసుకున్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8.29 లక్షలు, స్థలం+ఇంటి కోసం 2.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం తెలపగా కేంద్రం మరోసారి ఆ వివరాలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవగానే ఏప్రిల్‌లో ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనుంది.

Similar News

News February 28, 2026

ఇరాన్‌తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

image

మిడిల్ ఈస్ట్‌లోని సౌదీ అరేబియా, UAE, కువైట్, ఖతర్, బహ్రెయిన్, జోర్డాన్ తమ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కాపాడుకుంటూ మద్దతిస్తున్నాయి. ఇక వెస్ట్రర్న్ దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సైతం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను తీవ్రంగా తప్పుబడుతూ US వైపు నిలుస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అమెరికాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఇరుదేశాలకు మద్దతుపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News February 28, 2026

అమెరికాతో ఢీ.. ఇరాన్‌కు ఎందుకింత ధైర్యం?

image

మోస్ట్ పవర్‌ఫుల్ మిలిటరీ వ్యవస్థ ఉన్న US, ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఢీ అంటే ఢీ అంటోంది. తమ ఆయుధ సంపత్తితో పాటు మిత్రపక్షాల బలమే దీనికి కారణం. హమాస్, హెజ్బోల్లా, హౌతీ, పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌తో పాటు ఇరాక్‌లోని కొన్ని గ్రూపులూ మద్దతు ఇస్తున్నాయి. రష్యా, చైనా కూడా ఆ దేశానికి అండగా నిలుస్తున్నాయి. ఇక ఆసియాలో ఇరాన్‌కు పాక్ మిత్రదేశంగా ఉంది. కానీ USను ఎదురించి ఆ దేశానికి మద్దతిచ్చే ధైర్యం పాక్‌కు లేదు.

News February 28, 2026

ఇండియాలోనే ఎత్తైన కుటుంబాన్ని చూశారా?

image

సాధారణంగా కుటుంబ సభ్యులందరూ ఒకే ఎత్తులో ఉండటం అరుదు. కానీ పుణేకు(MH) చెందిన కులకర్ణి కుటుంబంలోని నలుగురూ ఆజానుబాహులే. తండ్రి శరద్ (7.2ft), తల్లి సంజ్యోత్ (6.3ft), కుమార్తెలు మృగ (6.2ft), సానియా 6.4ft ఉండటంతో ఈ కుటుంబం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. వీరి ఎత్తుకు తగ్గట్టుగా ఇంట్లోని తలుపులను 8 అడుగుల మేర రూపొందించుకున్నారు. ఇలాంటి వింత విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..