News February 24, 2026

KMR: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజు (27) అనే యువకుడు మృతి చెందాడు. బైకుపై గ్రామానికి వస్తుండగా జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొన్నాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలైన రాజును ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News February 27, 2026

విశాఖ: సైబర్ నేరాలకు అడ్డాగా మ్యూల్ ఖాతాలు

image

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఏజెంట్లు కమీషన్ ఆశ చూపించి వారి పేర్లపై మ్యూల్ ఖాతాలు తెరిపిస్తున్నారు. ఈ ఖాతాల ద్వారానే సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి విదేశాలకు తరలిస్తున్నారు. బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే నిధుల రికవరీ కష్టమవుతోంది. మ్యూల్ ఖాతాలు సరఫరా చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 400 మంది అకౌంట్‌దారులను అరెస్టు చేశారు.

News February 27, 2026

లైఫ్ సైకిల్ ఫండ్స్ వచ్చేశాయ్.. గోల్‌ని బట్టి డబ్బులు అడ్జస్ట్!

image

పిల్లల చదువులు లేదా రిటైర్మెంట్ కోసం పడే తిప్పలు తప్పించేలా సెబీ ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ తెచ్చింది. ఇందులో ఎంత కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో చెబితే చాలు. మొదట్లో లాభాల కోసం షేర్ మార్కెట్‌లో ఎక్కువ పెట్టి, లక్ష్యం దగ్గర పడేకొద్దీ దాన్ని సేఫ్ డిపాజిట్లలోకి ఫండ్ మేనేజరే మార్చేస్తారు. పాతకాలపు రిటైర్మెంట్ ఫండ్స్ ప్లేస్‌లో ఇవి వస్తున్నాయి. ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలనే టెన్షన్ ఉండదిక.

News February 27, 2026

పాడి పశువులను కొనే ముందు జాగ్రత్తలు

image

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.