News February 24, 2026
NLG: ఖాళీలతో కునారిల్లుతున్న మున్సిపాలిటీలు

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో కొలువుదీరిన కొత్త పాలక వర్గాలకు క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు సిబ్బంది లేమి పట్టణాల అభివృద్ధికి ఆటంకంగా మారాయి. కొత్తగా ఏర్పాటైన చిన్న మున్సిపాలిటీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. NLG, SRPT, BNG, DVK, HZNR, MLG తదితర మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.
Similar News
News February 26, 2026
ఇద్దరి మృతి.. అండగా ఉంటా: ఇల్లందు ఎమ్మెల్యే

నిన్న జరిగిన ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. పోస్టుమార్టం ప్రక్రియపై డాక్టర్లతో, కేసు దర్యాప్తుపై సీఐతో మాట్లాడారు. ప్రమాదానికి కారకులైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
News February 26, 2026
చిత్తూరు జిల్లాలో RDOల బదిలీ

కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 26, 2026
చర్లపల్లి: ఖైదీలకు నూనె తయారీపై శిక్షణ

చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా.సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు. కార్యక్రమంలో DIGలు శ్రీనివాస్, సంపత్, సూపర్డెంట్లు భరత్ ప్రమోద్, ఆయుర్వేద వైద్యులు, అధికారులు ఉన్నారు.


