News February 24, 2026
నేడు ఆర్టీసీ కార్మికుల ‘చలో సెక్రటేరియట్’..

తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో, ఆర్టీసీ కార్మికులు మంగళవారం ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ ఈ పోరాటాన్ని చేపట్టింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా జేఏసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
Similar News
News February 27, 2026
చిత్తూరు జిల్లా వన్‌స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు

చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల మహిళలు నేటి నుంచి మార్చి 9 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ(లా, సోషల్ వర్క్, సోషల్ సైన్స్, సైకాలజీ), LLB, పారా మెడికల్ డిగ్రీ/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/
News February 27, 2026
జిల్లా ఆసుపత్రిలో పడిపోతున్న రక్త నిలువలు

జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో రక్త నిలువలు అడుగంటిపోతుండటం కలకలం రేపుతోంది. 400 యూనిట్ల సామర్థ్యం ఉన్న బ్యాంకులో ప్రస్తుతం కేవలం 66 ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోగుల అవసరాల దృష్ట్యా ఒకరికి రక్తం ఇచ్చేందుకు ఇద్దరు దాతలను కోరుతున్నా.. కొరత తీరడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రోగులకు ప్రాణాపాయం తప్పదని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News February 27, 2026
MLA శ్రీధర్ స్థానంలోకి కొత్త వ్యక్తి.?

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై పార్టీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే నివేదిక ఇవ్వలేదు, చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు వీడియోలు విడుదల చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారనే ప్రచారం జోరందుకుంది. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న వారికి ఇన్‌ఛార్జ్ పదవి ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.


