News February 24, 2026
NLG: కొత్త సొసైటీల ఏర్పాటుపై కసరత్తు

రైతులకు మరింత చేరువగా సేవలందించేందుకు ఉమ్మడి జిల్లాలో కొత్తగా 64 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటుకు సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి (NLG-42, SRPT-44, YDD-21). కొత్త సంఘాల ఏర్పాటులో భాగంగా పాత సొసైటీల పరిధిలోని కొన్ని గ్రామాలను విడదీసి కొత్త వాటిలో విలీనం చేయనున్నారు.
Similar News
News February 27, 2026
అమ్మాయిలపై ప్రభావానికి కారణమిదే..

ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. అలాగే మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు ఈ తరహా వ్యాధులను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. దీంతో అది తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉంటాయి.
News February 27, 2026
HNK: అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?

అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా HNK కలెక్టరేట్ మారింది. ఏకంగా ACBకి అడిషనల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఇంట్లో నోట్ల కట్టలు కూడా దొరికాయి. ప్రస్తుతం IASల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అక్రమార్కులపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి పనికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తన మార్క్ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు.
News February 27, 2026
ఖమ్మం: విద్యార్థుల్లో పెరుగుతున్న దృష్టి లోపాలు

రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లాలో నిర్వహించిన కంటి పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సెల్‌ఫోన్ల వాడకం, పోషకాహార లోపంతో 42,277 మంది విద్యార్థులను పరీక్షించగా, 2,297మందిలో దృష్టి లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి త్వరలోనే కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గుండె జబ్బులు, ఇతర శారీరక లోపాలున్న విద్యార్థుల కోసం వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.


