News February 24, 2026
‘వాల్తేరు రైల్వేకు అదనపు ఆదాయం’

వాల్తేరు డివిజన్ తన టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచేందుకు 10 WAP-7 ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లపై ప్రకటనల కోసం ఢిల్లీ సంస్థతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఏడాదికి రూ.7 లక్షలకు పైగా, మొత్తం మీద రూ. 26 లక్షల ఆదాయం లభిస్తుందని డీఆర్ఎం పవన్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంజిన్లపై జొమాటో వంటి ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తున్నాయి.
Similar News
News February 27, 2026
ఏలూరు జిల్లాలో వైరల్‌గా మారిన ఉద్యోగిని లెటర్

ఏలూరులోని తంగెళ్ల మూడి సచివాలయంలో ANMగా పనిచేస్తున్న కామేశ్వరి రాసినట్లు ఉన్న లేఖ సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. పని ఒత్తిడిలో తాను అలసిపోయానని, సెలవు ఇప్పించాలని ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నట్లు ఉంది. సెలవు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో కామేశ్వరి బుధవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తన మెంటల్ కండీషన్ బాగోలేదని లేఖలో రాసినట్లు ఉంది.
News February 27, 2026
పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా?

వ్యాక్సిన్లు పిల్లలను వ్యక్తిగత వ్యాధుల నుంచి రక్షించడమే కాక Herd Immunityని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపు ,ఆసుపత్రి ఖర్చుల తగ్గింపు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు లభిస్తాయి. కాబట్టి పిల్లల టీకాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.
News February 27, 2026
తీవ్ర విషాదం.. రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రింకూ హుటాహుటిన సొంతూరుకు బయలుదేరారు. కొన్ని రోజులుగా ఖచంద్ర లివర్ క్యాన్సర్(ఫోర్త్ స్టేజ్)తో బాధపడుతున్నారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలిసి 3 రోజుల కిందటే రింకూ ఆసుపత్రికి వెళ్లారు. నిన్న మ్యాచ్ సమయానికి మళ్లీ తిరిగి జట్టుతో చేరినా ప్లేయింగ్-11లో చోటు దక్కలేదు.


