News February 24, 2026

సంగారెడ్డి: చికెన్ కోసం కొట్టుకున్నారు!

image

సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన <<19213297>>వివాహ విందులో<<>> మాంసం ముక్కల విషయంలో గొడవ చెలరేగింది. విందులో ముక్కలు వేయలేదని చాకలి వీరేశం, రంజిత్‌ల మధ్య వివాదం మొదలై, రంజిత్ కర్రతో వీరేశంపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరేశంను ఆసుపత్రికి తరలించారు. సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 2, 2026

ఖమేనీకి ఎంత మంది పిల్లలో తెలుసా?

image

ఇజ్రాయెల్-US దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఒక భార్య, ఆరుగురు పిల్లలున్నారు. ఆయన భార్య పేరు మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్. వీరికి 1964లో వివాహమైంది. నలుగురు కుమారులు (మోస్తఫా, మొజ్తాబా, మసౌద్, మేసమ్), ఇద్దరు కూతుళ్లు (బోష్రా, హోదా), ఏడుగురు గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఓ కూతురు, కోడలు, మనుమరాలు, అల్లుడు కూడా మరణించినట్లు వార్తలొచ్చాయి.

News March 2, 2026

టీడీఆర్‌ల మంజూరులో అవినీతికి తావివ్వొద్దు: ప్రణవ్

image

వీఎంఆర్డీఏ చేపడుతున్న పనుల్లో అధికారులు నిర్లక్ష్యం ఆలసత్వం చూపించవద్దని కమిషనర్ తేజ్ భరత్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఆయన కార్యాలయంలో సోమవారం అధికారులతో అభివృద్ధి పనులు, లేఅవుట్లు, రహదారి విస్తరణ పనులపై సమీక్ష చేశారు. విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్‌ల మంజూరులో అవినీతి ఉండకూడదన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు

News March 2, 2026

ఎస్ఐలకు హైకోర్టులో ఊరట

image

కోటి 82 లక్షల మోసం కేసులో నిందితులుగా ఉన్న ఎస్ఐలు మహేష్, రాణా ప్రతాప్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. తమపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.ను కొట్టివేయాలని వారు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సోమవారం న్యాయస్థానం విచారించింది. వీరిని ప్రస్తుతం అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు నిందితుల తరపు న్యాయవాది కార్తీక్ వెల్లడించారు. గత నెల 23న బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.