News February 24, 2026

చిన్నారి మృతి కేసులో ముగ్గురి అరెస్ట్

image

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చిన్నారి <<19205888>>మృతికి<<>> కారణమైన నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సర్పంచ్ తుకారాంరెడ్డి సహా మరో ఐదుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News February 28, 2026

ఉచిత రేషన్.. కేంద్రం కీలక నిర్ణయం

image

ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫికేషన్‌ చేసే ప్రాసెస్‌ను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. బియ్యాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు అందులోని పోషక విలువలు తగ్గిపోతున్నట్లు IIT ఖరగ్‌పూర్ స్టడీలో తేలడమే దీనికి కారణం. మరింత మెరుగైన పద్ధతిలో పోషకాలను అందించే విధానాన్ని గుర్తించే వరకు ఈ ప్రాసెస్‌ను ఆపాలని నిర్ణయించారు. అయితే రేషన్ కోటాలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

News February 28, 2026

కివీస్ ఓటమి.. పాక్‌కు దక్కిన లైఫ్ లైన్!

image

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో న్యూజిలాండ్ తన సెమీఫైనల్ బెర్తును ప్రమాదంలో పడేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఎటువంటి లెక్కలతో పని లేకుండా నేరుగా సెమీస్‌కు వెళ్లేవాళ్లమని, మా పని సులువు అయ్యేదని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాటింగ్‌లో విఫలమయ్యామని అంగీకరించారు. కివీస్ ఓటమి పాక్‌కు కలిసొచ్చింది. నేడు శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే సెమీస్‌లోకి దూసుకెళ్లే ఛాన్స్ ఉంది.

News February 28, 2026

BJP ‘జనగణమన’ను కూడా తొలగిస్తుందేమో: ఉద్ధవ్ ఠాక్రే

image

ప్రాంతీయ భాషలను అంతం చేసి హిందీ ఆధిపత్యాన్ని రుద్దాలని BJP చూస్తోందని శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. దేశంలోని ప్రతి ప్రాంతాన్ని గర్వంగా చాటిచెప్పే ‘జనగణమన’ను కూడా BJP ఎక్కడ తొలగిస్తుందోనని భయమేస్తోందన్నారు. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రాంతీయ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఉద్ధవ్ పిలుపునిచ్చారు.